తెలంగాణ

ముస్లిం సోదరులకు జగన్ రంజాన్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ముస్లింలు నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరిస్తారని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిందన్నారు. రంజాన్ మాసం అంటే కేవలం ఉపవాస దీక్ష కాదని మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అన్నారు.