తెలంగాణ

ఇంటర్ బోర్డు కార్యదర్శి తప్పుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన చాలా అభ్యంతరకరంగా ఉందని, ఆయన వెంటనే తన పదవి నుండి తప్పుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. బోర్డు ఫలితాల అక్రమాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, బోర్డులో తప్పులు జరిగాయని త్రిసభ్య కమిటీ ప్రకటించినా, ఆత్మహత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బోర్డు కార్యదర్శి ప్రకటించడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించి, వారికి ఎక్స్‌గ్రేషియో చెల్లించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారుస. ఇంటర్ ఫలితాల ప్రకటనలో తీవ్ర అక్రమాలు జరగడంతో సుమారు 3.8 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, తమ భవిష్యత్‌కు నష్టం జరిగిందనే బాధతో తల్లిదండ్రుల బాధను చూడలేక చాలా మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గత 20 రోజులుగా ఫలితాల్లో లోపాలు సరిచేయమని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని, గ్లోబరీనా సంస్థ నిర్వహణలో పొరపాట్లు జరిగినట్టు ప్రకటించి తప్పులు, మూల్యాంకనం , ఐటీ లోపాలు సరిచేయాల్సిందిగా త్రిసభ్య కమిటీ నిర్ధారించిందని, దానిని అంగీకరించిన బోర్డు అధికారులు ఇపుడు తమ తప్పేమీ లేదని చెప్పడం విడ్డూరమని అన్నారు. పరీక్షలకు హాజరై ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు బోర్డు లోపాలు ఆశనిపాతమేనని, దీనికి ఇంటర్ బోర్డు పూర్తి బాధ్యత వహించాలని , బోర్డు కార్యదర్శి తన బాధ్యతల నుండి తప్పుకోవాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూపాయిలు చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని వీరభద్రం డిమాండ్ చేశారు.