తెలంగాణ

డిగ్రీలో ఉమ్మడి ప్రవేశానికి ‘దోస్త్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఉమ్మడి ప్రవేశాలకు దోస్త్ ఆన్‌లైన్ విధానాన్ని పాటిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి జనార్థన్‌రెడ్డి చెప్పారు. సోమవారం నాడు దోస్త్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన దోస్త్ షెడ్యూలను విడుదల చేశారు. ఒకే దరఖాస్తుతో రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీలకు, అన్ని కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం దీని ద్వారా లభిస్తోందని ఇటువంటి సౌకర్యం దేశంలో మరే రాష్ట్రంలో లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పేర్కొన్నారు. దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వీ వెంకటరమణ , ఉస్మానియ, కాకతీయ, మహాత్మాగాంధీ , తెలుగు యూనివర్శిటీ, పాలమూరు వర్శిటీ, శాతవాహన యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, వివిధ యూనివర్శిటీల ప్రిన్సిపాల్స్, కోటి మహిళా కళాశాల, బేగంపేట , బీజేర్ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నోటిఫికేషన్‌ను మే 15వ తేదీన విడుదల చేస్తామని, దోస్త్ రిజిస్ట్రేషన్లు 16వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో ప్రారంభం అవుతాయని అన్నారు. ఫీజుల చెల్లింపు, కాలేజీల్లో రిపోర్టు చేసేదీ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని, తద్వారా తమ అంగీకారాన్ని తెలిపినట్టు అవుతుందని అన్నారు. ఆర్థిక ఇబ్బంది పడకుండా, ఎలాంటి సర్ చార్జీలు లేకుండా దోస్త్ పోర్టల్‌కు టీ వ్యాలెట్‌ను అనుసంథానం చేస్తామని అన్నారు. విద్యార్థులకు ఉండే చిన్న చిన్న అనుమానాలు లేదా పొరపాట్లను సవరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని, అందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. రెగ్యులర్ హెల్ప్‌లైన్ సెంటర్లకు తోడు ఇవి అదనంగా పనిచేస్తాయని అన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏకరూప వార్షిక ప్రణాళికను అమలుచేస్తామని, విద్యాసంవత్సరం జూలై 1 నుండి ప్రారంభం అవుతుందని కన్వీనర్ లింబాద్రి వివరించారు.