తెలంగాణ

స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 6: మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. ఖమ్మం జిల్లాలో 85.74, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 77.33శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే ఖమ్మం జిల్లాలో భారీగా పోలింగ్ నమోదు కావటం విశేషం. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కారేపల్లి, కామేపల్లి మండలాల పరిధిలోని 7 జెడ్పీటీసీలు, 110 ఎంపీటీసీలకు, కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, బూర్గంపాడు మండలాల పరిధిలోని 7 జెడ్పీటీసీలు, 71 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో, ముదిగొండ మండలం కమలాపురం, అయ్యగారిపల్లి గ్రామాలలో, కారేపల్లి మండల పరిధిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. అలాగే కారేపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ బూత్‌లోకి పిచ్చికుక్క చొరబడి నలుగుర్ని గాయపర్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం ప్రాంతాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలిసులు మందుస్తు చర్యలు చేపట్టారు. కాగా బూర్గంపాడు మండల కేంద్రంలో తాను వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫోటో తీసి ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అలాగే ఓటు వేస్తున్న విధానాన్ని మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సంఘటన సంచలనం కలిగించింది. కాగా అనేక చోట్ల పోలింగ్ బూత్‌లలో కనీస సౌకర్యాలు లేకపోవటంతో ఎండ వేడిమికి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 97.62 శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చర్లలో 73.60, దుమ్ముగూడెంలో 79.79పోలింగ్ శాతం నమోదైంది.