తెలంగాణ

అందరి ఆదరణతోనే ఆర్టీసీ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 21: రాష్ట్రంలో నిత్యం ప్రయాణాలు చేసేవారితో పాటు, అధికారులు, ప్రజాప్రతినిధుల ఆదరణతోనే ఆర్టీసీ అభివృద్ది చెందుతుందని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌తో పాటు పరిసరాలను ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు నష్టాల సాకుతో ఆర్టీసీని మూసివేసేందుకు అనేకమార్లు ప్రయత్నించారని, అయితే తెలంగాణ సర్కార్ మాత్రం నష్టాలెంత వచ్చినా భరిస్తూనే ఆర్టీసీని ప్రజాసేవకు వినియోగించేందుకు నిర్ణయించిందని స్పష్టంచేశారు. ఇటీవల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారన్నారు. సామాజిక దృక్పథంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు వెనుకాడేదిలేదన్నారు. ప్రజలు కూడా దీనిని గమనించి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని పిలుపునిచ్చారు. కొనే్నళ్ళుగా నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీని ఆదుకునేందుకు నెలకు రూ.75కోట్ల చొప్పున ముఖ్యమంత్రి అందిస్తున్నారని, మినహాయింపుల ద్వారా ఆర్టీసీకి బకాయిపడ్డ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధుల నిధుల నుంచి జిల్లాకు రూ. 10కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మొత్తంతో జిల్లాలోని బస్టాండ్ల ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. జగిత్యాల డిపో స్ఫూర్తిని విస్తరింపజేయాలన్నారు. ప్రయాణీకులకు సరైన వేళల్లో బస్సు సౌకర్యం కల్పిస్తేనే ఆర్టీసీకి మనుగడ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, ఆర్టీసీ ఈడి సత్యనారాయణ, ఆర్‌ఎం చంద్రశేఖర్, తదితరులున్నారు.