తెలంగాణ

9 నుండి గీతం యూనివర్శిటీ యూజీ, పీజీ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: గీతం యూనివర్శిటీ హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగలూరు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ స్లైడింగ్ విధానంలో కౌనె్సలింగ్‌ను ఈ నెల 9 వ తేదీ నుండి 11 వరకూ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కే నరేంద్ర తెలిపారు. గీతం ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన వారు తమ కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకుని వారికి నిర్దేశించిన సమయంలో కౌనె్సలింగ్‌కు హాజరుకావాలని ఆయన సూచించారు. గీతం హైదరాబాద్ ప్రాంగణం, గీతం విశాఖ ప్రాంగణం, విజయవాడ, తిరుపతి, గీతం బెంగలూరు ప్రాంగణంతో పాటు బెంగలూరు సిటీలో మొత్తం ఆరు చోట్ల కౌనె్సలింగ్ నిర్వహిస్తామని, ఎక్కడి నుంచైనా విద్యార్థులు పాల్గొని తమకు నచ్చిన ప్రాంగణంలో నచ్చిన ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశం పొందవచ్చని ప్రొఫెసర్ నరేంద్ర వివరించారు. మే 9న 9 గంటలకు ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు కౌనె్సలింగ్ ప్రారంభిస్తామని, అదే రోజు 10.30 గంటలకు తొలి ర్యాంకు నుండి 6వేల ర్యాంకు వరకూ నిర్వహిస్తామని అన్నారు. 10న ఆరు వేల నుండి 12 వేల ర్యాంకు వరకూ, ఆఖరి రోజు 11న 12001 నుండి 18 వేల ర్యాంకు వరకూ కౌనె్సలింగ్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. గీతం ప్రవేశపరీక్షలో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తామని, ధృవపత్రాల పరిశీలన అనంతరం సీట్లు పొందిన విద్యార్థులు అదే రోజు కౌనె్సలింగ్, ట్యూషన్ రుసుములను చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమతో పాటు కౌనె్సలింగ్ కాల్‌లెటర్, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు, పది, ఇంటర్ ఉత్తీర్ణతా పత్రాలు, ఆధార్ కార్డు, టీసీ, సీసీ, దివ్యాంగులు మెడికల్ సర్ట్ఫికేట్‌ను, ఎస్సీ, ఎస్టీలు సమీకృత కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాలని అన్నారు.