తెలంగాణ

ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణలో తెలంగాణకు తొలి స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: ఆన్‌లైన్ విత్తన ధృవీకరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్రప్రభుత్వ వ్యవసాయ శాఖ విత్తన విభాగం సహాయ కమిషనర్ డాక్టర్ డి.కే. శ్రీవాస్తవ శ్లాఘించారు. హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్‌లో విత్తన ధృవీకరణ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వినియోగించుకుందన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో విత్తన ధృవీకరణ ప్రారంభమైందని, మిగతా రాష్ట్రాలేవీ, ఈ విషయంలో స్పందించడం లేదన్నారు. ఆన్‌లైన్‌లో మొట్టమొదట విత్తనధృవీరణ చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతోందన్నారు. ప్రతి విత్తన ప్యాకెట్‌పై బార్ / క్యూఆర్ కోడింగ్ ఉండాలని కేంద్రం సలహా ఇచ్చిందని గుర్తుచేశారు. ఇందులో విత్తనం ఉత్పత్తిదారుడి వివరాలు, విత్తన పరీక్షా వివరాల వరకు సంక్షిప్తంగా పొందుపరిచేందుకు వీలుందని శ్రీవాస్తవ తెలిపారు. ఆన్‌లైన్ విత్తన ధృవీకరణను తెలంగాణ రాష్ట్రం 2019 జూలై 1 నుండి అమలు చేస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తెలిపారు. 2016 నుండి అనేక సమస్యలను అధిగమించి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో విత్తన ధృవీకరణ చేస్తున్నామని విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు వివరించారు. విత్తన ధృవీకరణ క్రమాన్ని సంస్థ డిప్యూటీ డైరెక్టర్, నోడల్ అధికారి జి. సుదర్శన్ లైవ్ డెమోద్వారా ఈ సందర్భంగా వివరించారు.