తెలంగాణ

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణలో స్థానిక సంస్థల నుండి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 31 న ఉప-ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి గతంలో ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి, నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్ స్థానిక సంస్థ నియోజకవర్గాల నుండి ఎన్నికైన కొండా మురళీధర్‌రావులు తమ పదవులకు రాజీనామా చేయడంతో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజీనామా చేసిన వారు 2022 జనవరి 4 వరకు ఎమ్మెల్సీలుగా కొనసాగేందుకు వీలు ఉండేది. నరేందర్‌రెడ్డి, రాజ్‌గోపాల్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ ఆదేశాల మేరకు మురళీధర్‌రావు రాజీనామా చేశారు. దాంతో ఖాళీ అయిన ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారమే ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. మే 15 న స్క్రూటినీ ఉంటుంది. 17 న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. 31 న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 3 న ఓట్ల లెక్కింపు చేస్తారు. జూన్ 7 వ తేదీ వరకు ఎన్నికల కార్యక్రమం పూర్తవుతుంది. మూడు స్థానాలు తామే ఏకగ్రీవంగా గెలుచుకుంటామని టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. ఇది ఇలా ఉండగా మూడు స్థానిక సంస్థలకు నిర్వహించాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కోరాయి. ఈ మేరకు నాలుగు పార్టీల ప్రతినిధులు మంగళవారం సీఈఓను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఒకవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు స్థానిక సంస్థల నియోజకవర్గాల నుండి ఉపఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్‌రెడ్డి, టీడీపీ ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ తరఫఉన అజీజ్ పాషా తదితరులు పేర్కొన్నారు.