తెలంగాణ

ఆ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: ఇంటర్ బోర్డు అవకతవకల వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతకు నిరసనగా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్న కే లాస్య, సికింద్రాబాద్‌లో మరో విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు ఉన్న 26 మంది విద్యార్థులు చనిపోవడం హృదయ విదాకరమన్నారు. గాంధీనగర్‌లో అనామిక అనే బాలిక ఆత్మహత్య చేసుకుందని, వారి తల్లితండ్రులను కలిశానని, చాలా బాధగా ఉందన్నారు. ఈ పిల్లల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి పిల్లలకున్యాయం చేస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే, సీఎం, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నిర్వాకం వల్ల విద్యార్థుల తల్లితండ్రులు క్షోభకు గురవుతున్నారన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచేందుకు భరోసా యాత్రను కొనసాగిస్తామన్నారు. మరణించిన అనామిక సోదరి ఉదయను చదివించే బాధ్యతను బీజేపీ స్వీకరించినట్లు ఆయన చెప్పారు.