తెలంగాణ

అక్రమ నర్సరీలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: కల్తీనారు విక్రయించే నర్సరీలపై ఇకనుండి ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఉద్యాన డైరెక్టర్ ఎల్. వెంకటరామ్‌రెడ్డి హెచ్చరించారు. కల్తీనారుమొక్కల ఉత్పత్తి, అమ్మకాలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే జీఓ జారీ అయిందని గుర్తు చేశారు. కల్తీనారును నియంత్రించేందుకు, చీడలు, తెగుళ్లులేని నాణ్యత కలిగిన ఆరోగ్యకరమైన మొక్కలను ఉత్పత్తి చేసేందుకు, విక్రయాల్లో పారదర్శకత కలిగి ఉండేందుకు నర్సరీ యజమాన్యులకు బుధవారం అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి హాజరవుతారని వెంకట్‌రామ్‌రెడ్డి తెలిపారు.