తెలంగాణ

స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: గ్రామాలకు కొత్త సర్పంచ్‌లు ఎన్నికై నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. గ్రామాల్లో ప్రజలు మంచినీటితో కటకటలాడుతున్నారని, వౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను మంజూరుచేయకుండా రాష్ట్రప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా నిధులను కూడా గ్రామాలకు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తుంటే , కేసీఆర్ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్లుగా అనుమానం వస్తోందన్నారు. ఎన్నికల తీరు చూస్తుంటే తుగ్లక్ పాలనను తలపిస్తుందన్నారు. కేసీఆర్ కేరళకు వెళ్లి వామపక్ష పార్టీ ఫ్రంట్ ప్రభుత్వ నేతలను కలవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీలనేతలు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ చేస్తున్న కసరత్తుకు సొంత రాష్ట్రంలోనే లెఫ్ట్ నేతలు మద్దతునివ్వడం లేదన్నారు.