తెలంగాణ

నమ్మకం లేకనే ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం లేకనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో దీక్షలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో నిమ్మరసం తాగించి దీక్షలను విరమింపచేసిన చుక్కా రామయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మహత్యలు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వం పోరాడి సాధించుకోవాలని అంతే తప్ప విద్యార్థి సంఘాల నాయకులు సైతం ఆరోగ్యాలను పాడు చేసుకోవడం సరికాదని అన్నారు. నిరసన దీక్ష అనేది లక్షలాది మంది విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఉద్ధృత నిరసనకు ప్రతీక అని అన్నారు. దీక్షలో కూర్చున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకత్వానికి చుక్కా రామయ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు. దీక్ష ప్రజలను విద్యార్థులను చైతన్యం చేయడమేగాక, పాలకవర్గానికి కూడా కనువిప్పు కలిగిందని అన్నారు. పరీక్షలు అంటే విద్యార్థులు, తల్లిదండ్రుల జీవితాలని, ఆ పరీక్షలనే పాలకవర్గాలు పరీక్షగా మార్చేశాయని అన్నారు. విద్యార్థి ఉద్యమాలే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను ఉచితంగా చేసేందుకు దోహదం చేసిందని అన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల 26 మంది విద్యార్థులను బలితీసుకుందని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు చేఘసుకోవడం అంటే వారికి ఏ రకమైన పరిష్కారం దొరకకపోవడమేనని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ నరసింహరావు, తల్లిదండ్రుల సంఘం కార్యదర్శి లక్ష్మయ్య, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, నగర కార్యదర్శి దశరథ్, డీవైఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు సాంబశివ, టీ మహేందర్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జావేద్, అశోక్, సంతోష్, ప్రకాశ్ కారత్, సాయి, డీవైఎఫ్‌ఐ నేతలు రాజశేఖర్, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... గాంధీ ఆస్పత్రిలో విద్యార్థి సంఘాల దీక్షలు విరమింపజేస్తున్న చుక్కా రామయ్య