తెలంగాణ

కేసీఆర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, మే 8: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వానిదేనని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖను 70 రోజులలో తన ఇష్టానుసారంగా గ్లోబరీనా సంస్థకు కట్టబెట్టి అస్తవ్యస్తంగా ఫలితాలు ప్రకటించారని బీజేపీ శాసనసభ మాజీ విపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవక లు, విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్టప్రతి రాజ్‌నాథ్‌కోవింద్‌కు పూర్తి నివేదికను అం దిస్తామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి అశోక్‌ను, విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి హైకోర్టు ప్రధాన న్యాయముర్తితో పూర్తి విచారణ జరిపి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని కార్గిల్ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని గాయత్రి కుటుంబసభ్యులను పరామర్శించి, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వంపై పోరాటం సాగుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్రంలో ఫెయలైన 3 లక్షల 20 వేల మంది ఇంటర్ విద్యార్థులకు రీ వెరిఫికేషన్‌ను జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఅర్ తన ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ దేశంలో ఎక్కడా లేని ముఖ్యమంత్రిగా పేరు సంపాదించాలనే తపనతో నేడు 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులయ్యారని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని మాయమాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నియామకం చేపట్టలేదని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి నియమకాలు లేవని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌లతో బీజేపీ కార్యకర్తలను గృహ నిర్బంధం, దౌర్జన్యంగా అరెస్టులు చేసిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న నిర్వాకంపై ధర్నాలు, ర్యాలీలు చేస్తే పోలీసులతో కేసులు పెడుతున్నారన్నారు. పార్టీల ఫిరాయంపులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ పాలనపై పెట్టడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర మూడు ఎమ్మెల్సి ఎన్నికల్లో వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణ పట్ట్భద్రులు, టీచర్లు, మేధావులు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఇక టీఅర్‌ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైందన్నారు.
ఇక రాష్ట్ర ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడుతారని అయన అన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పతనం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొరల పాలన చేస్తూ కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు, బీజేపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, నింగిరెడ్డి, కొండయ్య, రతంగ్‌పాండురెడ్డి, విజయ్‌కుమార్, హన్మం తు, లక్ష్మారెడ్డి, కృష్ణయ్యగౌడ్, భరత్‌కుమార్, రమేష్, వార్డు మెంబర్ శ్రీకాంత్, భరత్, వెంకట్రాములు, శేశప్ప, అశప్ప, నర్సిములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ఊట్కూర్‌లో ఇంటర్ విద్యార్థిని గాయత్రి కుటుంబాన్ని పరామర్శించిన
బీజేపీ శాసనసభ మాజీ ప్రతిపక్ష నేత కిషన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి