తెలంగాణ

సీఎం పదవిపై ఆశ లేని వారే పీసీసీ అధ్యక్షుడుగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి పదవి పట్ల ఆశలేని వారిని నియమించాలని , ఈ విషయమై ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ రాయనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడడం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైఫల్యం కాదని, సొంత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయిస్తున్నారన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీకేడర్‌లో ఉత్తమ్ కుమార్ మనోధైర్యం నింపారని ఆయన కొనియాడారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని, వారి గురించి త్వరలో చెబుతానని ఆయన చెప్పారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తనపై చేసిన విమర్శలకు స్పందించనని ఆయన అన్నారు. ఆమె వల్ల పార్టీకి ఉపయోగమని ఆయన చెప్పారు. ఆమె సేవలను తెలంగాణలోనే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగించుకోవచ్చన్నారు. పార్టీలో సీనియర్లు అంతా పీసీసీతోసమన్వయంతో పనిచేయాలన్నారు. అప్పుడే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీలో కార్యకర్తలు, నేతలు సమిష్టిగా పనిచేస్తే పరిషత్ ఎన్నికల్లో మంచి విజయాలు సాధిస్తామన్నారు.
కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లను తగ్గించిన కేసీఆర్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లను తగ్గించారని పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ కత్తివెంకటస్వామి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జనరల్ సీట్లలో కూడాబీసీల్లో టిక్కెట్లు ఇచ్చామన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ బీసీ వర్గాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి గెలిపించాలన్నారు. కేసీఆరర్ ప్రజాసమస్యలను గాలికివదిలేసి దేశం పట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఎస్పీల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనపై ఎస్సీ, బీసీ, మైనార్టీలను కూడగట్టే మరో తెలంగాణ ఉద్యమాన్ని చేపడుతామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి సిద్ధిపేటలో ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు. ఇందిరాపార్కు వద్ద మందకృష్ణ నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం నిరంకుశత్వమేనన్నారు.