తెలంగాణ

ఇంటర్ విద్యార్థులను వదిలేసి విహార యాత్రలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వైఫల్యంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ విహారయాత్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కన్‌కల్ గ్రామంలో మరణించిన దళిత విద్యార్థి జ్యోతి కుటుంబ సభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబానికి చెందిన విద్యార్థిని జ్యోతి మరణం తీవ్రంగా కలిచివేస్తున్నదన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. రాష్ట్రప్రభుత్వం నిరంకుశ విధానాలను విడనాడాలన్నారు. ముఖ్యమంత్రికి అధికార యావ తప్ప మరొకటి లేదన్నారు. కనీసం చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు ముఖ్యమంత్రికి , మంత్రులకు తీరిక లేదనా అన్నారవు. తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థుల ఉద్యమాలే స్ఫూర్తినిచ్చాన్నారు. ఈ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకున్నారన్నారు. బోర్డు తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో చీకటి రజు అన్నారు. అనేక తప్పిదాలు జరిగాయని, విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రాష్ట్రప్రభుత్వం తప్పిదాలను గ్రహించి విద్యార్థులు, తల్లితండ్రులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. కాగా బీజేపీ నేతలు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వారు రాష్టప్రతి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను కలిసి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకుదారితీసిన పరిస్థితులు, బోర్డు వైఫల్యాలను వివరించనున్నారు.