తెలంగాణ

నక్సల్స్ ఇలాకాలో 76 శాతం పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 10: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ఘట్టం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో ఈసారి భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి సీసీ కెమెరాల మధ్య నిఘా పెంచారు. ఆసిఫాబాద్ కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాల్లోని 9 జడ్పీటీసీలు, 43 ఎంపిటీసీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగినప్పటికీ ఓటర్లు మండుటెండలను లెక్కచేయకుండా తమ చైతన్య స్ఫూర్తిని చాటిచెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా వేసవి తాపాన్ని భరిస్తూనే స్వచ్ఛందంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించిన ఈ రెండు జిల్లాల్లో నాలుగు కంపెనీల సిఆర్‌పిఎఫ్ బలగాలు, తెలంగాణ స్పెషల్ పార్టీ బలగాలు బందోబస్తులో పాలుపంచుకున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ప్రాణహిత తీరం వెంబడి చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. మందమర్రి మండలంలో అత్యిధికంగా 81.88 శాతం పోలింగ్ జరగగా కోటపల్లిలో 78.97, చెన్నూరులో 79.59 శాతం ఓటింగ్ జరిగింది. బోథ్ మండలం దివిటి మారుమూల గ్రామస్తులకు 6 కి.మీటర్ల దూరంలోని పార్డిబిలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో దూరభారాన్ని నిరసిస్తూ ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామాన్ని పంచాయతీగా చేయకపోవడం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నామని, ఓటు వేసినా ప్రయోజనం లేకుండా పోతుందని వాపోయారు. తిర్యాణి మండలం గోలేటి ఎంపిటీసీ పరిధిలోని దేవులగూడ గ్రామస్తులు అధికారుల తీరును నిరసిస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం మధ్యాహ్నం అధికారులకు తెలియడంతో డీఎస్పీ సత్యనారాయణ గ్రామానికి వెళ్ళి నచ్చజెప్పడంతో మధ్యాహ్నం తర్వాత 140 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలోని తిర్యాణి, రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లో భారీగానే పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాలో 74.29 శాతం పోలింగ్ జరగగా నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలైనా తిర్యాణి, మంగి ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైపూర్ మండలం ఇందారంలో కాంగ్రెస్ కార్యకర్తపై ఎస్సై చేయిచేసుకున్నారని, టీఆర్‌ఎస్ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసు కమిషనర్ సత్యనారాయణ చేరుకొని అందోళనకారులను శాంతింపజేశారు.