తెలంగాణ

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, మే 11: అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందాలంటే టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మామిడాల, ఎల్లమ్మగూడెం, గోదవారిగూడెం, సిలార్మియగూడెం గ్రామాల్లో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24గంటల కరెంటు వచ్చేదా? అని ప్రజలు ఆలోచించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కరెంటు కష్టాలు తీర్చామన్నారు. 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌దే అన్నారు. చిన్న గ్రామ పంచాయతీలుగా చేసి ఆత్మగౌరవాన్ని కాపాడింది సీఎం కేసీఆర్ అన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలకు దేశంలో ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గ్రామాల అభివృద్ధి జరగదని, కారు గుర్తు ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని, వారిని గెలుపించుకునే బాధ్యత మీదే అని తెలిపారు. కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కారు ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి నల్లగొండ జడ్పీపీఠం కైవసం చేసుకోవాలని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, లొడంగి గోవర్ధన్, కందుల లక్ష్మయ్య, నాగేశ్వర్‌రావు, చంద్రు, రమేష్, శ్రీనివాస్, వెంకన్న, వివిధ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి