తెలంగాణ

నైపుణ్యం లేకుంటే వృత్తిలో రాణించలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: నైపుణ్యం లేనిదే న్యాయవాద వృత్తిలో రాణించలేరని, కొత్తగా న్యాయవాదులైన వారంతా విషయపరిజ్ఞానంతో , చట్టాలపై అవగాహనతో తమ వాదనలను వినిపించాలని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలన్నా నైపుణ్యత అవసరమన్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో నల్సార్ , తెలంగాణ స్టేట్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో కీలక రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగితే మరింత సత్ఫలితాలను సాధించగలుగుతారని అన్నారు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే భాష, విజ్ఞానం, వికాసం, చట్టంపై అవగాహనతో పాటు వాక్పటిమ చాలా కీలకమవుతుందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బి శివప్రసాదరావు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు, నల్సార్ ఉపకులపతి ప్రొఫెసర్ ఫైజన్ ముస్త్ఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ శిక్షణ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.