తెలంగాణ

టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత చింతల కనకారెడ్డి మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుమపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన కనకారెడ్డి ద్రాక్ష రైతుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ప్ర జారాజ్యం పార్టీ నుం చి పోటీ చేసి ఓడిపో యారు. కనకారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, మాజీ మం త్రి హరీష్ రావు, పార్టీ నేతలు ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి ప్రకటించి నివాళులర్పించారు. శాసనసభ్యుడిగా దివంగత కనకారెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
దేవేశ్వర్ మృతి పట్ల సంతాపం
భారత పారిశ్రామిక దిగ్గజం, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దేవేశ్వర్ అందచేసిన సహకారాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దేవేశ్వర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.