తెలంగాణ

విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మే 11: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని పలువురు వక్తలు అరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష శనివారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి, కార్యదర్శులు వహించాలని ఇరువురిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో కేసీఆర్‌కు కూడ భాగముందని పేర్కొన్నారు. మరణించిన బాధిత కుటుంబాలకు రూ.25లక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించే వరకు అన్ని జిల్లా, మండల కేంద్రలలో ఉద్యమాలను నిర్వహించాని పిలుపునిచ్చారు. అఖిల పక్షం తీసుకున్న నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, రాష్ట్రపతి ని కలిసి ఇంటర్ బోర్డు వైఫల్యాలను తెలియచేస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులు 26 మంది చనిపొతే వారి కుటుంబాలను ఇప్పటి వరకు పరామర్శించలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని విమర్శించారు.
జన సమతి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళలను ప్రభుత్వం పట్టించుకోకుండా మంత్రులంతా విహార యాత్రలో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపొతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాయ్యం జరిగే వరకు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. సిపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకున్న విద్యాశాఖ మంత్రిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని అన్నారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సీపీఐ సీనియర్ నేత నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేతలు షబీర్ అలీ, కొండా విశే్వశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఇంటీపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, జన సమితి నాయకుడు పీఎల్ విశే్వశ్వర రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
చిత్రాలు.. ఇందిరాపార్కు వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు మాట్లాడుతున్న దృశ్యాలు