తెలంగాణ

విద్యుత్‌ను తెగవాడేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు అమాంతంగా పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరవాసులు విద్యుత్‌ను తెగ వాడేస్తున్నారు. తెలంగాణలో ఆదివారం రోజు విద్యుత్ వినియోగం దాదాపు 6414 మెగావాట్లకు చేరుకుంది. ఒక్క హైదరాబాద్‌లో ఆదివారం జంటనగర వాసులు వాడిన విద్యుత్ గణాంకాలు పరిశీలిస్తే దాదాపు 3వేల మెగావాట్లు వినియోగించినట్లు లెక్కలు చెబుతున్నాయి. మే చివరకి వరకూ చూస్తే మరింత విద్యుత్‌ను వాడుకునే పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అకాల వర్షాలు వస్తే కాస్త విద్యుత్ తగ్గుముఖం పట్టవచ్చునని వారు గుర్తు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఆదివారం విద్యుత్ వినియోగం పరిశీలిస్తే హైదరాబాద్ మినహా 2605 మెగావాట్లు నమోదయంది, ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి విద్యుత్ వినియోగం ఆదివారం రోజు కేవలం 1455 మెగావాట్లు విద్యుత్ నమోదయంది. ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి.