తెలంగాణ

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ కేంద్ర కార్యాలయం ముఖ్దూం భవనంలో అఖిలపక్ష నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన పార్టీలు సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, జనసేనతో పాటు వామపక్షాల పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనపై రాష్టప్రతిని కలవాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. విద్యార్థులకు సంబంధించిన టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మెమోలతో మానవ హక్కుల కమిషన్‌ను కలవాల ని తీర్మానించారు. కేసీఆర్ విహార యాత్రలకు సమయం దొరుకుతుంది, కానీ అఖిలపక్షాన్ని కలిసేందుకు సమయం లేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఇంటర్ మార్కుల్లో తీవ్ర గందరగోళానికి కారణమైన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు సీఎంను నిలదీశారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థలు అందరూ మెరిట్ విద్యార్థులేనని అఖిలపక్షం నేతలు పేర్కొన్నారు. టీజెఎస్ కోదండరాం మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యసమాజం కూడా స్పందించాలన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తుంటే, సంబంధించిన విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం దుర్మార్గం అన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలను ప్రకటించే ముందు జాగ్రత్తలు చేపట్టి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యల అంశం ప్రస్తావనకు వచ్చేది కాదన్నారు. పిల్లలే ఆస్తులని నమ్ముకున్న తల్లిదండ్రులకు ఎంత ఇచ్చినా ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్రం... సీపీఐ కేంద్ర కార్యాలయం మగ్దూం భవనంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష నేతల
అత్యవసర సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి