తెలంగాణ

కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 12: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అభ్యర్థుల తరఫున నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడని తెలంగాణ తెచ్చిన గొప్పనేత అని ప్రశంసించారు. త్వరలోనే దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారని వెల్లడించారు. ఈనెల 23న వెలువడనున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ చుట్టూ దేశ రాజకీయాలు ఉండబోతున్నాయని తెలిపారు. దేశంలో జాతీయ పార్టీల పని గల్లంతు అవుతుందని పాంత్రీయ పార్టీలదే కేంద్రంలో కీలకం కాబోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దివాలాకోరు రాజకీయాల కారణంగా ఆ పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోనే ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన రైతుబంధు పథకం దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పథకంగా మారిందని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం నడుస్తూ ఆ రాష్ట్రాల్లో రైతుబంధు పథకం తరహాలో పలు పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారని ఆరోపించారు. గతంలో ఎండాకాంల వచ్చిందంటే గ్రామాల్లో ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతూ కిలోమీటర్ల దూరం వెళ్లి ఇబ్బందులు పడేవారని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం రాష్ట్ర ప్రజల దాహర్తిని తీరుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ప్రభంజనం మరోసారి నిరూపితం అవుతుందన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మా కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ నేత బాలాజీ సింగ్ పాల్గొన్నారు.
చిత్రం... ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్