తెలంగాణ

ప్రజల గోడుపట్టని సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు చేయడం ఏమిటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి నిలదీశారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగంతో కలసి ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల గోడుపట్టించుకోకుండా సీఎం విహార యాత్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎండలు, వడదెబ్బ, అకాల వర్షాలు, ధాన్యం కొనుగోలు వంటి సమస్యలపై ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన రైతు బోదాసు గోపాల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద దాదాపు 22 రోజులు పడిగాపులు కాసి చివరకు ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు వదిలారని ఆయన గుర్తు చేశారు. చనిపోయిన రైతు వడదెబ్బ తగిలిందని సాకులు వెతకండం సోచనీయమన్నారు. నిజామాబాద్‌లో ధాన్యాన్ని కొనుగోలుకు తీసుకువచ్చి 48 రోజులు గడచినా ఎవ్వరూ పట్టించుకున్న పాపాత్ముడు లేరన్నారు. ఇలా వరుసగా రైతులు బాధలతో మృతి చెందుతుంటే ముఖ్యమంత్రి రాష్ట్రాల పర్యటనలు అవసరమా అంటూ ఆయన దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలుకు సమయం లేదుకానీ, ఇతర పార్టీల నేతల్ని, కార్యకర్తలను కొనుగోలు చేయడానికి సమయం వెచ్చుస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. రైతులకు గన్నీ బ్యాగుల కొరత ప్రభుత్వం దృష్టికి రాలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వౌలిక వసతులు కల్పించాలన్నా ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం వింతగా ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు లక్షల ఎకరాల్లో వరి,మిర్చి, పత్తి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని ఆయన గుర్తు చేశారు.