తెలంగాణ

‘ఇంటర్’పై కాలయాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ఇంటర్ పరీక్షల్లో 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా, రోడ్డు ప్రమాదాల్లో డజన్ల కొద్దీ మరణిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ అంటూ కాలయాపన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. సోమవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థుల మరణాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కనీసం వాళ్లకు సంఘీభావం కూడా తెలపడం లేదని అన్నారు. ఇంతటి నియంత ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం శవాలనే కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్టప్రతిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న స్టాలిన్‌ను కేసీఆర్ కలవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వం కోసం టీమ్‌ను తయారుచేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నిరంతరం ఒక మ్యాకప్ కిట్ తయారుచేసుకుని నిరంతరం అదే మ్యాకప్‌తో ఉంటున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనలపై ఉన్న యావ దేశ సమస్యలపై లేవని అన్నారు. నోట్ల రద్దుచేసి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని, వేల కోట్ల బ్లాక్‌మనీ వైట్ మనీగా మార్చేందుకు ఇదో స్కీం పెట్టారని అన్నారు. అంతకు ముందు నగర కార్యదర్శి ఈటీ నర్సింహ మాట్లాడుతూ ఇంటర్ వైఫల్యాలకు బాధ్యులైన వారిపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకల్లో బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు.
చిత్రం...ముగ్దుం భవన్‌లో ప్రసంగిస్తున్న సీపీఐ నారాయణ