తెలంగాణ

చీకటిని జయించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: గమ్యం వెనుక పరుగులు తీస్తే విజయం వరిస్తుందో తేదో తెలీదుకానీ సవాళ్లనే అవకాశాలుగా మలుచుకుని శక్తి- యుక్తుల్ని సరిగ్గా అంచనా వేసుకుని అడుగులు వేస్తే, విజయం తప్పకుండా వరిస్తుంది. మనోధైర్యం, పట్టుదల, అడ్డంకులను అధిగమించే స్థిరత్వం ఉన్నవ ఆరు విజయాన్ని ముద్దాడుతారు. అలాంటి ఉదాహరణే యూ రుత్విక్ రామ్. ఆబిడ్స్‌లోని స్లేట్ ది స్కూల్‌లో 4వ తరగతి నండి చదువుతున్న రుత్విక్ ఈ రంగుల ప్రపంచాన్ని చూడలేడు. అయినా సోమవారం నాడు వెలువడిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 9.5 జీపీఏతో తన ప్రతిభను చాటుకున్నాడు. తన కృషి, పట్టుదలతో సవాలు విసిరిన విధిని సైతం ఓడించాడు. అలాగే స్లేట్ స్కూల్ యాజమాన్యం, టీచర్ల సహకారం అతని కృషికి తోడయ్యాయి. కంటి చూపు లేని అందరు విద్యార్థుల మాదిరే రుత్విక్ కూడా స్క్రైబ్ సహకారం తీసుకున్నాడు. రుత్విక్ రామ్‌కు స్క్రైబ్‌గా వ్యవహరించింది ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి. రుత్విక్ రామ్ సాధించిన ఈ ఘనవిజయాన్ని స్లేట్ యాజమాన్యం, టీచర్లు, సహ విద్యార్థులు అభినందించారు. భవిష్యత్‌లొ రుత్విక్ రామ్ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలని తాను కోరుకుంటున్నానని, సొంతంగా ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు.
నల్గొండలో...
నల్లగొండ అంధుల పాఠశాల విద్యార్థులు ఎనిమిది మంది పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.