తెలంగాణ

నిర్వాసితుడి ఆత్మహత్యా యత్నంతో గజ్వేల్‌లో ఉద్రిక్తత-లాఠీచార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 13: కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితి చక్కదిద్దగా, నిర్వాసితులను దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మామిడ్యాల గ్రామానికి చెందిన దాచారం కనకయ్య (24) తనకున్న భూమిని కోల్పోతుండటంతో మెరుగైన పరిహారం కోసం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. అయితే పోలీసుల బందోబస్తు మధ్య ఆ పొలంలోకి వెళ్లి పనులు చేపట్టగా, మనస్తాపానికి గురైన కరుణాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని వైద్య చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అప్పుడే అక్కడకు చేరుకున్న డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ క్రమంలో అప్పటికే ఆసుపత్రి వద్ద గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టగా, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో పాటు అక్కడికి చేరుకున్న నిర్వాసిత రైతులను వారు నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొని లాఠీచార్జికి దారితీయగా, తూంకుంట నర్సారెడ్డిని ఏసీపీ నారాయణ నెట్టుకుంటూ డీసీఎం వ్యాన్ వద్దకు తీసుకెళ్లి పోలీసుల సహాయంతో అందులోకి తోసేశారు. అలాగే అడ్డువచ్చిన బాధిత రైతులను సైతం అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌లోకి ఎక్కించగా, ఆత్మహత్యాయత్నానికి యత్నించిన దాచారం కనకయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.
కాగా ఇరువర్గాల తోపులాటలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు కనకయ్య భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ముందు చూపుతో వ్యవహరిస్తూ గజ్వేల్‌లో బందోబస్తు కొనసాగిస్తుండగా, బాదితులకు న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు నర్సారెడ్డి ప్రకటించడంతో పార్టీ శ్రేణులు గజ్వేల్‌కు తరలి వస్తున్నాయ.
చిత్రాలు.. పరామర్శకు వచ్చిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని నెట్టుకుంటూ తీసుకెళ్తున్న పోలీసులు,
*కరుణాకర్‌ను వైద్య చికిత్స కోసం తరలిస్తున్న పోలీసులు