తెలంగాణ

తేరా విజయం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 13: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌కు తేరా తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి జి.జగదీష్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఈ దఫా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు. గతంలో ఇదే స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్థానిక ఓటర్ల బలం తక్కువగా ఉన్నప్పటికీ గట్టి పోటీనిచ్చామన్నారు. అయితే నాలుగేళ్లలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుండి మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారన్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీఆర్‌ఎస్‌కు ప్రస్తుత స్థానిక ఓటర్లలో స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని, ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనంటూ ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారన్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతోందన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు కృషి చేసేందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన సంఖ్యాబలం ఉన్నందున తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఆర్.రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... నామినేషన్ దాఖలు చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి