తెలంగాణ

కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 14: కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోని సీఎం కేసీఆర్ అహంకారంతో నిర్వాసిత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆమరణ దీక్ష చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి సంఘీభావం ప్రకటించి విలేఖరులతో మాట్లాడారు. సర్వం కోల్పోయి ప్రభుత్వానికి భూములను అప్పగిస్తున్న రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వ వైఖరి మారాలని, పోలీసు బందోబస్తు మద్య భయభ్రాంతులకు గురిచేస్తూ పనులు చేపట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకం కాదని, నిర్వాసిత రైతులకు మెరుగైన పరిహారం, ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్టుల నిర్మాణాలు చేతకాక ఆ నిందలను కాంగ్రెస్‌పై వేస్తుండటం ఎంతమాత్రం తగదని, కోర్టు తీర్పులు సైతం ఉల్లంఘిస్తూ పాలన చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతులకు న్యాయం చేసిన అనంతరమే పనులు చేపట్టాలని కోర్టు స్టేలు ఇచ్చినా నిర్మాణాలు జరుగుతుండడంతో రైతులు ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలిచి పోరాటం చేస్తుందని, అన్నదాతల్లో బరోసా నింపుతుందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తీర్థ యాత్రలు తిరుగుతూ మానసిక ఆనందం పొందుతున్న కేసీఆర్ ఏ ఒక్క సమస్యపై కూడా మాట్లాడకపోవడం దారుణమని ఎద్దేవా చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దురదృష్టకరం కాగా, ప్రజావ్యతిరేక విధానాలు మానితేనే ప్రజలు మీ వైపున ఉంటారన్న విషయాన్ని గమనించి అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని హితవు పలికారు. రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటే పరామర్శించిన పాపానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై పోలీసుల అనుచిత వైఖరి సముచితంగా లేదని, ఈ అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి ఎండగడతామని అన్నారు. ప్రగతిభవన్, ఫాంహౌస్‌కు పరిమితం కాకుండా సెక్రటేరియట్‌కు వస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వివరించారు. నేతలు మామిడ్యాల శ్రీనివాస్, నిమ్మ రంగారెడ్డి, నర్సింహాచారి, గాలెంక నర్సింలు, తోట ముత్యాలు, సర్దార్‌ఖాన్, మల్లారెడ్డి, ఎక్బాల్, బానుగౌడ్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
చిత్రం... మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆమరణ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్న పొన్నం ప్రభాకర్