తెలంగాణ

బాధితులకు న్యాయం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలతో అనూహ్య ఫలితాలు చూసి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబ సభ్యులు అంతా ఏకీకృతం అవుతున్నారు. రాష్ట్రంలో 23 మంది ఇంత వరకూ మరణించగా వారిలో 11 మంది విద్యార్థుల కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ డీ సుధాకర్ నేతృత్వంలో జరిగిన బాధితుల సమావేశానికి ఆత్మహత్యకు పాల్పడిన అనామిక సోదరి ఉదయ, జ్యోతి సోదరుడు వీరేష్ తదితరులు, వారి కుటుంబ సభ్యులు హాజరై తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి అనామిక కుటుంబ సభ్యులను పరామర్శించారని అయితే పరీక్షలో ఫెయిలైనంత మాత్రాన చనిపోవడమేనా అంటూ మాట్లాడటం మరింత బాధించిందని ఆమె సోదరి ఉదయ పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా గట్టి చర్యలు తీసుకుంటామనో, బాధ్యులను శిక్షిస్తామనో, బాధితులను ఆదుకుంటామనో చెప్పాల్సిన మంత్రి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఉందని, దాంట్లో రాసుకోవాలనడం ఎంత వరకూ భావ్యమని ప్రశ్నించింది. వాస్తవానికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో రాసుకునే వారికి సబ్జెక్టుల పక్కన స్టార్ ఇస్తారని, అది ఫెయిలై పాసైన వారితో సమానమని, ఆ విషయాన్ని మంత్రి గమనించకుండా సప్లిమెంటరీ రాసుకోవచ్చు కదా అని చెప్పడం దుర్మార్గమని డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించడానికి మంత్రికి 20 -25 రోజులు పట్టిందని, టెన్త్‌లో ఏ గ్రేడ్ వచ్చిన అమ్మాయికి, ఇంటర్‌లో తెలుగులో తక్కువ మార్కులు రావడం అంటే అవకతవకలు జరగడమేనని పేర్కొన్నారు.
చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చనిపోయన ఇంటర్ విద్యార్థి కుటుంబాల సభ్యులు