తెలంగాణ

ఒక్క ‘ఐడియా’తో వాయు కాలుష్యానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: 2019 జూన్ 5 న నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘గాలి కాలుష్య నిర్మూలన’ అంశంపై వ్యాసరచన పోటీలను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గాలి కాలుష్య నిర్మూలన అంశంపై ‘బెస్ట్ ఐడియా’ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పర్యావరణవేత్తలు, విద్యార్థులు తదితరులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. 500 పదాలకు మించకుండా ఇంగ్లీషు లేదా తెలుగులో వ్యాసం రాయవచ్చని, ఈ వ్యాసాలను 2019 మే 25 సాయంత్రం 5 గంటలలోగా తమకు పంపించాలని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. వ్యాసాలను ‘సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం, ఏ-3, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్‌నగర్, హైదరాబాద్-500 018’ కు పంపించాలని సూచించారు. మెయిల్‌కు కూడా వీటిని పంపించవచ్చని తెలిపారు. ఉత్తమ సలహాలు ఇచ్చిన వారికి బహుమతులు ఇస్తారు. ఉత్తమమైనదానికి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు బహుమతిగా అందిస్తామని వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2019 రోజు బహుమతులను ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకోసం ల్యాండ్‌లైన్ 040-2388 7500 నెంబర్‌కు పోన్ చేసి తెలుసుకోవచ్చునని కాలుష్య నియంత్రణ మండలి పీఆర్‌ఓ వెల్లడించారు.