తెలంగాణ

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న మజ్లిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే శక్తులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత జీ కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో నగరంలో అశాంతిని నెలకొల్పే విధంగా మజ్లిస్ పార్టీ చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అంబర్‌పేట ఫ్లైవోవర్ ప్రజల చిరకాల స్వప్నమని, దీనిని భగ్నం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే ఖాద్రికి సహకరించి ఉద్రిక్తతకు కారణమైన పోలీసు, ఇతర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఐఎం అభివృద్థికి విఘాతం కలిగిస్తోందన్నారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పీసీసీ నేత, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. అంబర్‌పేట జాతీయరహదారి ఫ్లైవోవర్ కోసం జరిగిన భూసేకరణలో మసీదును అధికారులు అక్రమంగా కూల్చివేశారని పేర్కొనడం కాంగ్రెస్ విధానమా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ వంతెనపైన తన విధానాన్ని స్పష్టం చేయాలని కోరారు. మతచాందసవాదుల భావాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మంచిది కాదని ఆయన అజరుద్దీన్‌కు హితవు చెప్పారు.