తెలంగాణ

రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై సైబరాబాద్ పోలీసులు లుక్‌అవుట్‌కు పోలీసులు రంగ సిద్ధం చేస్తున్నారు. వారు విదేశాలకు పారిపోకుండా ఉండడానికి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అలర్ట్‌ను ప్రకటించనున్నారు.
మరోవైపు వారిద్దరిపై పోలీస్ ఉచ్చు బిగుస్తోందని ఒక సీనియర్ అధికారి ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు. రవిప్రకాశ్, శివాజీలకు 160, 41 సీఆర్పీసీ కింద జారీ చేసిన నోటీసులు గడువు శుక్రవారంతో ముగియనుంది. తొలుత ఇచ్చిన గడవులోగా పోలీసుల ఎదుట హాజరు కాకపోవడం చట్టవ్యతిక చర్యలకు పాల్పడినట్లుగా కేసులు నమోదు చేశారు. నోటీసులకు స్పదించకపోవడంతో రవిప్రకాశ్, శివాజీలు పరారీలో ఉన్నట్లుగా పరిగణించాల్సి ఉంటుందని అధికారి వెల్లడించారు. ముందు ఇచ్చిన నోటీసులకు స్పందించకపోగా, 10 రోజులు గడువుఇవ్వాలని న్యాయవాది ద్వారా సమాచారం పంపడంతో సైబరాబాద్ పోలీసుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వారిద్దరి కదలికలపై నిఘా పెంచారు. తమ నుంచి తప్పించుకోడానికే పది రోజుల గడువు కోరినట్టు సైబరాబాద్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రవిప్రకాశ్, శివాజీపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈ కేసును సైబరాబాద్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. వారిద్దరిని అరెస్టు చేయడానికి పోలీసులు న్యాయస్థానం అనుమతి తీసుకోనున్నారు.
దీనిలో భాగంగానే శుక్రవారం పిటిషన్ వేయనున్నారు. నిందితులు ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో లేరన్న సమాచారంతో వారిపై లుక్‌అవుట్ జారీ చేయడానికి రంగ సిద్ధం అవుతోంది. టీవీ 9 సీఈవోగా ఉంటూ అక్రమంగా నిధుల మళ్లింపు, పత్రాలను ఫోర్జరీ, సంస్థ నిర్వహణను అడ్డుకున్నారన్న చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దీనిపై టీవీ 9 కొత్త యాజమాన్యం అలంద డైరెక్టర్ కౌశిక్‌రావు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులు సైబర్‌క్రైమ్ కేసు నమోదు చేశారు. టీవీ 9 ఆఫీసు సోదాల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు ఇప్పటికే ఫోరెన్స్‌క్ ల్యాబ్‌కు పంపించారు.