తెలంగాణ

మల్లన్న ప్రాజెక్టు రైతులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపు బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. మల్లన్న సాగర్ బాధితులకు జెఎసి అండగా ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టులు వస్తేనే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని, అయితే మన కోసం ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే రైతులకు, గ్రామాలకు ముందు న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణ జెఎసి గూడ అంజయ్యకు ఘనంగా నివాళి అర్పించింది. అనంతరం జెఎసి నాయకులు కోదండరామ్, పిట్టల రవీందర్, వెంకట్‌రెడ్డి, ప్రహ్లాద్ మీడియాతో మాట్లాడారు. జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టుల్లో బాధిత రైతులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, తాటి చెర్ల, ముత్తారం రైతుల కోసం జూన్ 30న జెఎసి ఆధ్వర్యంలో అధ్యయన యాత్ర నిర్వహించనున్నట్టు చెప్పారు. జెఎసి సమావేశంలో న్యాయవాదుల సమ్మె, ఓపెన్ కాస్టు, విశ్వవిద్యాలయాల సమస్యలపై చర్చించారు. విద్యా విధానంపై ఈనెల 29న ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జెఎసి ఆధ్వర్యంలో విద్యా సదస్సు నిర్వహిస్తారు. విద్యారంగం నిపుణలు పలువురు ఈ సదస్సులో పాల్గొంటారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం, ఓపెన్ కాస్ట్ కోసం విధ్వంసం సృష్టిస్తున్నారని, తాటిచెర్ల ఓపెన్ కాస్ట్ కోసం రైతులు భూములు త్యాగం చేస్తే ఇంత వరకు రైతులకు న్యాయం చేయలేదని పిట్టల రవీందర్ తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై జెఎసిగా ఇప్పటి వరకు స్పందించలేదని కోదండరామ్ తెలిపారు. ఆ ప్రాజెక్టు డిపిఆర్ పూర్తిగా తెలుపనందున స్పందించలేదని, అయితే ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని అన్నారు.