తెలంగాణ

గోపాల్ మృతిపై న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ పంచాయతీకి చెందిన కొట్టాల్ గ్రామ నివాసి బోదాస్ గోపాల్ (48) తన ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చి అక్కడే మరణించడంపై న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధానకార్యదర్శి పశ్యపద్మ, నేతలు తోకల రామిరెడ్డి, ఏనుమణిలు రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డిని కోరారు. దానిపై స్పందించిన మంత్రి ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారని పశ్యపద్మ తెలిపారు. రైతు సంఘం బృందం గోపాల్ మృతిపై పరిశీలన జరపగా, కొనుగోలు కేంద్రంలో సరైన వసతులు లేవని తేలిందని అన్నారు. కేవలం రెండు కాంటాలు మాత్రమే ఉండటంతో తూకం వేయడానికి కూడా చాలా సమయం పడుతోందని చెప్పారు. ఎండల దృష్ట్యా కనీసం పందిళ్లు కూడా ఏర్పాటు చేయలేదని వారు మంత్రికి వివరించారు.