తెలంగాణ

మారంరాజు రచనలు తెలంగాణకు దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణ గ్రామీణ పరిపాలనకు సంబంధించిన అంశాలపై దివంగత ప్రొఫెసర్ మారంరాజు సత్యనారాయణరావు చేసిన రచనలు తెలంగాణ ప్రభుత్వానికి ధిక్సూచిగా ఉపయోగపడుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. బుధవారం తెలంగాణ మీడియా అకాడమీలో ప్రొఫెసర్ మారంరాజు సత్యనారాయణరావు రచించిన ‘తెలంగాణ గ్రామాయణం’ పుస్తకాన్ని ఘంటా చక్రపాణి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పుస్తకంలో మారంరాజు తెలంగాణ సమాజాన్ని గ్రామ పరిపాలనా వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలను సమగ్రంగా విశే్లషించారన్నారు. నైజాం హయాంలో హైదరాబాద్ స్టేట్‌లో అమలు చేసిన రెవిన్యూ, భూపరిపాలనా వ్యవస్థను సమగ్రంగా మారంరాజు విశే్లషించారన్నారు. తన అనుభవాలను, అధ్యయనాన్ని ఆచారణాత్మకంగా ఇందులో వివరించారన్నారు. మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారి జ్వాలా నరసింహారావు, బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరిశంకర్, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ నారా కిషోర్‌రెడ్డి, ప్రముఖ కవి డాక్టర్ సీతారామ్, బీసీ అధ్యయన కేంద్రాల డైరెక్టర్ డాక్టర్ బాలాచారి తదితరులు పాల్గొని ప్రసంగించారు.