తెలంగాణ

జిల్లా జైలులో ఉంగరాలు మాయంపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 15: నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో ఏ-6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ ఉంగరాలు నల్లగొండ జిల్లా జైలులో మాయమైన ఘటనపై జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య బుధవారం విచారణ సాగించారు. జిల్లా జైలును సందర్శించి జైలు అధికారులతో ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏడు నెలల క్రితం శ్రవణ్ జిల్లా జైలుకు వచ్చిన సందర్భంగా మూడు ఉంగరాలు జైలు అధికారులకు అప్పగించారని, ఇటీవల అతను వరంగల్ జిల్లా జైలు నుండి విడుదలై నల్లగొండ జిల్లా సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి తన ఉంగరాలను ఇవ్వమని అడుగగా అవి కనిపించడం లేదంటూ చెప్పారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా జైలు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి నల్లగొండ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారన్నారు. విచారణలో నిజానిజాలు తేలుతాయన్నారు. ఈ వ్యవహారంలో జైలర్ జలేందర్, సహాయ అధికారులు అనిల్‌కుమార్, అజయ్‌కుమార్‌లను విచారించాల్సివుందన్నారు. అయితే ప్రచారంలో ఉన్నట్టుగా శ్రవణ్ జైలు అధికారులకు అందించిన ఉంగరాలు ఆరులక్షల విలువైన వజ్రాల ఉంగరాలు కాదని దాదాపు 60వేలకు పైగా విలువైన బంగారు ఉంగరాలు మాత్రమేనని ఈ విషయమై శ్రవణ్ కూడా వివరాలు వెల్లడించారన్నారు. విచారణ పిదప ఈ కేసులో బాధ్యులను గుర్తించి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని, సంబంధిత ఉంగరాలు రికవరీ కాని పక్షంలో బాధ్యులైన వారి నుండి వాటి విలువను బాధితుడికి తిరిగి ఇప్పించేలా ఆదేశించామన్నారు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అనుమానితులను విచారించేందుకు చర్యలు చేపట్టామని వనటౌన్ సీఐ సురేష్ తెలిపారు.
చిత్రం... ఉంగరాల మాయంపై నల్లగొండ జైలును సందర్శించి విచారణ చేపట్టిన జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య