తెలంగాణ

ధాన్యం సేకరణ విధానం భేష్: ఎఫ్‌సీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం బాగుందని, ఏటేటా ధాన్యం దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు దోహదపడుతున్నాయని భారత ఆహార సంస్థ ప్రశంసించింది. తెలంగాణ రైస్ మిల్లర్ల వద్ద ఉన్న 3.44 లక్షల టన్నుల ముడి బియ్యాన్ని తీసుకునేందుకు ఎఫ్‌సీఐ సంసిద్థత వ్యక్తం చేసింది. సీఎంఆర్ బియ్యం ధృవీకరణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. ధాన్య సేకరణ, సీఎంఆర్ అప్పగింత, గిడ్డంగుల్లో స్థలం తదితర అంశాల్లో ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్రప్రభుత్వాన్ని ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ చేసిన విజ్ఞప్తులపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ఇందుకు సంబంధించి 23లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోదాముల్లో అవసరమైన స్పేస్‌ను చూపించకపోవడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం,కామారెడ్డి జిల్లాల్లో గోదాముల సమస్య తీవ్రతపై స్పందిస్తూ జాయింట్ కలెక్టర్లతో చర్చించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో భారత ఆహార సంస్థ ప్రధాన సలహాదారుడు ఎస్‌పీ కార్, జీఎం హేమంత్ జైన్, తెలంగాణ జీఎం అశ్వినీ కుమార్ పాల్గొన్నారు.