తెలంగాణ

దొంగలను కాపాడుతున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రాష్ట్రప్రభుత్వం ఇంటర్ ఫలితాల అక్రమాల దొంగలను కాపాడుతోందని ఆరోపిస్తూ విద్యార్థి , యువజన సంఘాల నేతలు శుక్రవారం నాడు మంత్రుల నివాసాల ప్రాంగణాన్ని ముట్టడించారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు విద్యార్థి నేతలను, యువజన సంఘాల నేతలను అరెస్టు చేసి పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. నిందితులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోందని వారు నిలదీశారు, విద్యామంత్రి జగదీష్‌రెడ్డిని బర్త్ఫ్ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒకొక్కరికీ రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని వారు కోరారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యు, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యుఐ, వీజేఎస్, జనసేన విద్యార్థి సంఘం, టీఎస్‌యు తదితర సంఘా ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రుల నివాసాల ముట్టడిని నిర్వహించారు. ముట్టడి సమయంలో నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం నేతలను గోషామహల్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఏఐఎస్‌ఎఫ్ అధ్యయుడు ఎన్ అశోక్ స్టాలిన్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ వలీ వుల్లా ఖాద్రి, ఎం అనిల్‌కుమార్, పీడీఎస్‌యు అధ్యక్షుడు మామిడికాయల పరశురాం, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌చంద్ర, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర నేత అభిజిత్ యాదవ్, టీఎస్‌యు అధ్యక్షుడు సందీప్, వీజెఎస్ నేత వి రమేష్ తదితరులు మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వారు పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై మొసలి కన్నీరు కారుస్తూ కపట నాటకాన్ని ఆడుతోందని వారు ఆరోపించారు.