తెలంగాణ

మాస్కోలో ప్రమాదం.. ఇంజనీర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, మే 17: మహీంద్రా యాన్స్‌లరీ కంపెనీ ముస్కో(ఐడీఏ)లో నైట్రోజన్ పేలి ఒక ఇంజనీర్ మృతి చెందగా, మరో నలుగురు ఇంజనీర్లు, కార్మికుడు గాయపడ్డారు. ఈ ఘటన చిరాగ్‌పల్ల పోలీస్‌స్టేషన్ పరిధి బూచినెల్లి పారిశ్రామిక వాడలో విషాదం నింపింది. పోలీసులు, కార్మికుల కథనం ప్రకారం..ముస్కోలో వెల్డింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న కార్మికులు ‘టీ’ టైం కావడంతో అందరూ టీ కోసం వెళ్లారు. కానీ ముందుగానే టీ తాగిన యూనిట్‌కు చెందిన ఇంజినీర్లు నైట్రోజన్ ను నింపేందుకు వెళ్లారు. నైట్రోజన్‌ను ఒక సిలిండర్‌లోనుంచి మరో సిలిండర్‌లోకి నింపుతున్న సందర్భంలో పెద్ద శబ్దం చేస్తూ సిలిండర్ పేలడం తో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన ఇంజినీర్ ప్రదీప్ (26) కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందినవాడు. ప్రదీప్‌కు మరో 15 రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. తీవ్రంగా గాయపడ్డవారిలో సదాశివపేటకు చెందిన కాశినాథ్, బీదర్‌కు చెందిన రంజీత్, కర్ణాటక మొటక్‌పల్లికి చెందిన సిద్దలింగప్ప, ఆంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీరాములు, కాంట్రాక్టు కార్మికుడు ఆకాష్ ఉన్నారు.