తెలంగాణ

బోనాలు, మొహర్రం ఉత్సవాల్లో ఏనుగులపై ఆంక్షలు ఎత్తివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి మందిరం, పాతబస్తీ శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం, మోహర్రం ఊరేగింపులకు ఆటంకం కలగకుండా నెహూ పార్కు ద్వారానే ఏనుగును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీసీసీ నేత, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం అధ్యక్షుడు జీ నిరంజన్ కోరారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి ఆటంకం కలిగించకుండా రెండు మూడు ఏనుగులకు శిక్షణ ఇచ్చే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని , ఈ మేరకు అటవీశాఖ ప్రధాన సంరక్షాధికారికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎటువంటి ఊరేగింపులకు నెహ్రూ జూ నుంచి ఏనుగును ఉపయోగించకూడదని హైకోర్టు ఈ ఏడాది మార్చి 18వ తేదీన ఆదేశాలు ఇచ్చిందన్నారు. దీన ఇవల్ల మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు, ప్రజల విశ్వాసాలకు భంగం కలిగిందన్నారు. జూలోని రజని అనే ఏనుగును నిజాం ట్రస్టు దశాబ్థాల క్రితమే తమ డబ్బుతో కొనుగోలు చేసి పార్కులో ఉంచే విధంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాలన్నారు. ఈ ఏనుగు ఆరోగ్యం బాగాలనేదని, మావటి నియామక ఫైలును పెండింగ్‌లో పెట్టి ట్రైనింగ్ పొందిన మావటి లేరని అటవీశాఖ తెలిపిందన్నారు. బోనాల పండగను రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నెల 12వ తేదీన కేరళలోని గురువాయూర్‌లోని వడుక్కునాదం ఆలయం త్రిసూర్ పూరం ఉత్సవంలో పాల్గొనడానికి 54 సంవత్సరాల ఏనుగును ప్రభుత్వం పంపించిందని, ఆంక్షలను కేరళ ప్రభుత్వం సడలించిందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.