తెలంగాణ

హాజీపూర్ బాధితుల దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, మే 18: నరహంతకుడు, సైకో శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలని, బాదిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని హత్యకు గురైన శ్రావణి, మనీషా, కల్పనల కుటుంబ సభ్యులు, హాజీపూర్ గ్రామస్తులు గురువారం చేపట్టిన అమరణ నిరాహార దీక్షను రెండురోజుల అనంతరం రాచకొండ పోలీసులు శుక్రవారం రాత్రి భగ్నంచేశారు. శుక్రవారం సాయంత్రం అమరణ నిరాహారధీక్షా చేపడుతున్నవారికి వైద్యపరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యపరిస్థితి క్షణిస్తుండడంతో భువనగిరి ఇంచార్జి ఆర్డీఓ విజయకుమారి, తహశీల్దార్ పద్మ సుందరిలు అమరణ నిరాహారదీక్ష శిభిరాన్ని సందర్శించి దీక్షను విరమించాల్సిందిగా బాదితులను కోరారు. బాదితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఏసీపీ భుజంగరావునేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి శుక్రవారం అర్ధరాత్రి 2.30గంటల సమయంలో దీక్షా శిభిరంలో నిద్రిస్తున్న 18మందిని అదుపులోకి తీసుకుని హుటాహుటిన హైద్రాబాద్‌లోని గాంధి ఆసుపత్రికి తరలించారు. నిరాహారదీక్షలో కొనసాగుతున్న 18మందికి గాంధి ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించి వారి దీక్షలను భగ్నంచేసిన అనంతరం శనివారం తెల్లవారుజామున మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిని తిరిగి ఉదయం 10గంటలకు హాజిపూర్ గ్రామానికి పోలీసులు చేర్చారు. అమరణ నిరాహారధీక్షను భగ్నంచేయడంపట్ల బాదిత కుటుంభసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తుశ్రావణి, మనీషాలను పూడ్చిపెట్టిన తెట్టెబావిలోకి దిగి నిరసనవ్యక్తంచేశారు. స్థానిక నాయకులు చొరవతీసుకుని తమ సమస్యల కలెక్టర్‌కు విన్నవించి పరిష్కారాన్ని డిమాండ్‌చేద్దామని తెలుపడంతో బావిలోంచి పైకివచ్చిన బాదిత కుటుంభాల సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి తరలివెళ్లారు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నవారిలో ఫక్కీర్ రాజేందర్‌రెడ్డి, పాముల నర్సింహ్మ, తుంగరి నందం, తిప్పరబోయిన మల్లేష్, ప్రవీణ్, తదితరులు ఉన్నారు.
దీక్షా శిబిరం వద్ద భారీ పోలీస్ బందోబస్తు
హాజీపూర్ గ్రామస్తులు, సైకొ శ్రీనివాస్‌రెడ్డి బాదిత కుటుంభాలు అమరణ నిరాహార దీక్ష చేపట్టిన శిబిరం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రాజకీయనాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, స్థానికులు తిరిగి ఆందోళన చేపట్టకుండా ముందస్తు జాగ్రత్తగా అమరణ నిరాహార దీక్ష టెంట్‌ను తొలగించి భద్రత ఏర్పాట్లు చేపట్టారు.