తెలంగాణ

ఆ 50 అవినీతి కేసులపై సమగ్ర విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో 50 అవినీతి కేసులను మూసివేయడం లేదా నీరుకార్చి శాఖాపరమైన విచారణకు ఆదేశించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. అవినీతి కేసులను ఏసీబీ నమోదు చేసినప్పుడు కేసును అన్ని కోణాల్లోంచి విచారించి ప్రభుత్వానికి తన సమగ్ర నివేదిక, విజిలెన్స్ కమిషన్ ద్వారా పంపుతారని చెప్పారు. విజిలెన్స్ కమిషన్ ఆ నివేదికను పరిశీలించచి ప్రభుత్వానికి సూచనలు చేస్తారన్నారు. విజిలెన్స్ నివేదిక మేరకు ఏసీబీకి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. కాని అలా జరగడం లేదన్నారు. సచివాలయంలో రెవెన్యూ శాఖ పెద్ద ఎత్తున అవినీతి అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.
అవినీతి అధికారుల కొమ్ముకాసే విధంగా ప్రభుత్వం శాఖ నడుచుకోరాదన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఏసీబీ పట్టుకుంటే విజిలెన్స్ తుది నివేదిక పంపిందన్నారు. సంవత్సరాలు గడిచినా ఈ కేసు సచివాలయంలో రెవెన్యూ శాఖలో ఉండిపోయిందన్నారు. ఈ కేసు ఇంకగా విచారణలో ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు. ఇదే కలెక్టరేట్‌లో పనిచేస్తున్న మరో ఉద్యోగి విషయంలో కేసును డ్రాప్ చేసినట్లు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒక డిప్యూటీ కలెక్టర్‌పై ఏసీబీ కేసు నమోదు ఏళ్లతరబడి పెండింగ్‌లో పెట్టారన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ప్రభుత్వ అధికారుల విషయంలో కూడా సాగతీత వైఖరిని రెవెన్యూ శాఖ అవలంభిస్తున్నాయన్నారు.