తెలంగాణ

ఎండలు, వడగాల్పులతో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ఎండలు, వడగాల్పుల పట్ల ప్రజలు ఇబ్బంది పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ సిన్హా మంగళవారం రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాము అప్రమత్తంగా ఉండి ఎండలు, వడగాల్పుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వివరించారు. వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రధాన రిజర్వాయర్లలో గత ఏడాది కంటే నీటి మట్టాలు పూర్తిగా తగ్గినట్టు జోషి వివరించారు. మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో ఆరు రోజులు, ఈ నెలలో 10 రోజులుగా వడగాల్పులు వీస్తున్నాయన్నారు. కలక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండటంతో కర్నాటక రాష్ట్రంతో చర్చించి జూరాల ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీటిని విడుదల చేయించామన్నారు. కరువు నివారణలకు కార్యాచరణ ప్రణాళికల అమలు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, రుతు పవనాల రాక, నీటి నిర్వహణ తదితర అంశాలపై కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ సీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బడ్జెట్‌లో అత్యధికంగా నీటిపారుదలశాఖకు నిధులు కేటాయించినట్టు జోషి వివరించారు. అలాగే మిషన్ కాకతీయ పథకం ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. జూలై నెలలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కాబోతుందన్నారు.
చిత్రం... కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ సిన్హా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి