క్రైమ్/లీగల్

ఆదిలాబాద్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మే 21: ఆదిలాబాద్ పట్టణ శివారులోని కస్తాల రామకిష్టు కాలనీలో రోడ్డు పక్కనే మొండెం లేని శిశువు తలభాగం లభ్యం కావడం కలకలం రేపింది. అక్రమ సంబంధంతో పుట్టిన శిశువును చంపి పడవేశారా..? లేదా ఇతర ప్రాంతం నుండి కుక్కలు పట్టుకువచ్చి రోడ్డుపై పడేశాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే కస్తాల రాంకిష్టు కాలనీలో మంగళవారం ఉదయం వాటర్ ట్యాంకు పక్కనే ముక్కుపచ్చలారని మొండెం లేని శిశువు తల పడి ఉండడాన్ని చూసి స్థానికులు కలవరపడ్డారు. ఈ విషయాన్ని వెంటనే మావల పోలీసులకు సమాచారం అందించగా వారం పది రోజుల కిందటే జన్మించిన శిశువుగా గుర్తించి తల భాగాన్ని రిమ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఇటీవల రిమ్స్‌తో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసూతి నిమిత్తం వచ్చిన మహిళల వివరాలపై ఆశా కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఎస్సై ముజాహిద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.