తెలంగాణ

అప్పుల ఊబిలో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను అధికారులు కప్పిపుచ్చుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు చేసిన ప్రకటన వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందని అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంటే.. రాబడులున్నా కొద్దిపాటి బిల్లులు పెండింగ్‌లో ఉండటం సహజమని చెప్పడం దారుణమని అన్నారు. 3400 కోట్ల కన్నా భారీగానే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. చాలా బిల్లులు ట్రెజరీ వరకూ రాకుండానే పెండింగ్‌లో పెడుతున్నారని, ఒక రకంగా సాంకేతికంగా తమ వద్ద పెండింగ్‌లో లేవని చెప్పుకోవడానికే అలా చేస్తున్నారేని అన్నారు. ఎప్పటికపుడు పెండింగ్‌లో పెట్టకుండా చెల్లింపులు చేస్తే ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఎందుకు పనులు నిలిపివేస్తారని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం, మధ్యాహ్న భోజన పథకం పనివారికీ, కళ్యాణలక్ష్మీ పథకానికి బకాయిలు ఉన్నాయని వెంకటరెడ్డి అన్నారు. అప్పులు తేడానికి రాష్ట్రానికి ఇంకా అవకాశం ఉందని చెప్పడం అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారనేది స్పష్టమవుతోందని అన్నారు.