తెలంగాణ

పాఠశాలల పున:ప్రారంభం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా జూన్ 1 నుండి ప్రారంభం కావల్సిన పాఠశాలలను మరో పది రోజులు తర్వాత ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే ముఖ్యమంత్రి కార్యాలయం ఫైళ్లను క్లియర్ చేస్తుందని, సానుకూల నిర్ణయమే వస్తుందని భావిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి చెప్పారు. కాగా పాఠశాలల పున: ప్రారంభ తేదీని వాయిదా వేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. జూన్ 1వ తేదీన కాకుండా జూన్ 12న ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఎండలు, వడగాడ్పులు తీవ్రంగా ఉన్నాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేస్తోందని రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి మరో వారం రోజులు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారని అన్నారు. వాతావరణం చల్లబడకుండా వడగాడ్పుల్లో స్కూళ్లు ప్రారంభించడం సరికాదని ఆయన అన్నారు.
బడిబాట తీరు మార్చండి: తల్లిదండ్రుల సంఘం
బడిబాట కోసం ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం షరామామూలుగా, మొక్కుబడిగా ఉందని, కొత్తదనం ఏదీ లేదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్యలు బడిబాట తీరు మార్చాలని కోరారు. జూన్ 4 నుండి 12 వరకూ ఉండే ఆరు పనిదినాలను వృధా చేయడం జరుగుతోందని బడి ఈడు పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే చేరిపోయారని అన్నారు. జనవరి , ఫిబ్రవరి నెలల్లోనే నో వేకెన్సీ బోర్డులు పెట్టేశాయని చెప్పారు. జూన్ 10న కొత్తగా చేరిన విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయాలని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.