తెలంగాణ

రెండు పార్టీల విధానం వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థ ఏర్పడుతుందని, బీజేపీ ఐదు ఎంపీ సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారుతాయని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని, ఈ సారి అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడుతామన్నారు. ప్రధాని మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేసి భ్రష్టుపట్టారన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నమ్మి మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత హరీష్ రావు వస్తే పార్టీలో చేర్చుకుంటామన్నారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ కండువాలు వేసుకున్న వారు కూడా మోదీ ప్రధాని కావాలని , బీజేపీకి ఓటు వేశారన్నారు. టీఆర్‌ఎస్ పేలిపోయే బుడగ అన్నారు. రాష్ట్రంలో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అనుమతి ఇచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకుని చేర్చుకుంటామన్నారు. సీటుమీద ఆశలేనివారు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు.
ఒక ప్రశ్నకు బదులిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు చచ్చిన పాము అన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున గెలిచే ఎంపీలకు మంత్రి పదవి ఇస్తే పార్టీ ఆహ్వానిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తల మీద ప్రజల మీద నమ్మకంతో ఒక రోజు ముందే సంబరాలకు సిద్ధమవుతున్నామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిసి వస్తే టీఆర్‌ఎస్ బలం 50 సీట్లకు పడిపోయి ఉండేదన్నారు.