తెలంగాణ

24 న విత్తన మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: తెలంగాణలోని మూడు చోట్ల ఈ నెల 24 న ‘విత్తనమేళా’ నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు తెలిపారు. రైతులకు విత్తనాలను అందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో, నాగర్‌కర్నూలు జిల్ల పాలెం, వరంగల్, జగిత్యాలలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో కూడా విత్తనమేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేళాలలో 8 రకాల పంటల్లో 27 రకాల విత్తనాలను విక్రయిస్తారు. వరిలో తెలంగాణ సోన, బతుకమ్మ, సుమతి, తెల్లహంస తదితర రకాలతో పాటు మొక్కజొన్నలో డీఎచ్‌ఎం 777, కరీంనగర్ మక్క తదితర రకాలు ఉంటాయి. కందిలో ఆశ, పీఆర్‌జీ 176 రకాలు, పెసరలో డబ్ల్యూజీజీ 42, ఎజీజీ 295 తదితర రకాల విత్తనాలు ఉంటాయి. విత్తనాల అమ్మకంలో రైతులకు సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తోందన్నారు. సబ్సిడీ కావాలని భావించే రైతులు తమ వెంట పట్టాదార్ పాస్‌పుస్తకం, జిరాక్స్ కాపీనీ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా చర్చాగోష్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
రాజేంద్రనగర్‌లోని విత్తనమేళాకు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగామ జిల్లాల రైతులు హాజరు కావలసి ఉంటుంది. జగిత్యాల జిల్లా పొలాసలోని విత్తనమేళాకు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం జిల్లాల రైతులు హాజరు కావలసి ఉంటుంది. పాలెంలో జరిగే విత్తనమేళాకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, గద్వాల, వనపర్తి జిలాల రైతులు హాజరు కావలసి ఉంటుంది. వరంగల్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నిర్వహించే విత్తనమేళాకు వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, భూపాల్‌పల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాల రైతులు హాజరు కావాలని ప్రవీణ్‌రావు వివరించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ, పశు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థలైన భారతీయ వరి పరిశోధనా సంస్థ, భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ, భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ తదితర సంస్థలు విత్తనమేళాలో పాల్గొంటున్నాయి.