తెలంగాణ

కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు మరోసారి భంగపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 23: మహబూబాబాద్ (మానుకోట) పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా మూడవసారి బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాంనాయక్‌కు మళ్లీ భంగపాటే ఎదురైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మానుకోట ఎమ్మెల్యేగా బలరాంనాయక్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనే మరోసారి బరిలోకి దిగారు. తెరాస అభ్యర్ధి మాలోతు కవిత చేతిలో దారుణంగా భంగపడి తన ఖాతాలో ఓటమిని నమోదు చేసుకున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా రాజకీయాల్లోకి వచ్చిన బలరాంనాయక్ తొలిసారి ఎన్నికల్లో విజయం సాదించి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా విధులు నిర్వహించారు. రెండవసారి ఇదేస్థానం నుండి బరిలోకి దిగి సీతారాంనాయక్ చేతిలో ఓడిపోయారు. మూడవసారి బరిలోకి దిగి కవిత చేతిలో ఓటమిని మూటగట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మొదటి నుండి తెరాస అభ్యర్ధి మాలోతు కవిత ఆధిక్యతలోకి దూసుకుపోతుండడంతో మధ్యలోనే బలరాంనాయక్ కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు.
కేసీఆర్ ఆశీస్సుల వల్లే.. కవిత
కురవి మండలకేంద్రంలో శ్రీవీరభద్రస్వామి వారి ఆలయంలో మానుకోట పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవిత గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఆమె తన స్నేహితురాలు హరితతో కలసి కురవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మానుకోట ఎంపీ స్థానానికి పోటీచేసే అవకాశం వచ్చిందని మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు అంతే అభిమానంతో తనను గెలిపించారని అన్నారు. కురవి వీరభద్రుని ఆశీస్సులు తీసుకోవడానికి ఆలయాన్ని సందర్శించినట్టు ఆమె తెలిపారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఎంపి మాలోతు కవిత ప్రత్యేక కృతజతలు తెలిపారు.